అమెరికా వెళ్ళే భారతీయ విద్యార్ధులకు శుభ వార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటి వరకు  కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న విద్యార్థులను  అనుమతించని అమెరికా ఇప్పుడు సడలింపులు ఇచ్చినట్లు సమాచారం. కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న విద్యార్థులకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి దాకా ఉన్న టెన్షన్ కాస్త క్లియర్ అయినట్టే అని చెప్పచ్చు. 


నిజానికి కోవాగ్జిన్ అమెరికాలో అత్యవసర అనుమతి కోసం కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు ప్రయత్నించినా అనుమతి అయితే లభించలేదు. మరి ఆ అనుమతి ఎప్పుడు లభిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: