సాధారణంగా ఆడవాళ్లు రెడీ అవటం అనే అంశం మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. సాధారణంగానే స్త్రీలు అలంకార ప్రియులు. సందర్భం ఉన్నా లేకపోయినా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎప్పుడూ తమ శక్తి మేర అందంగా రెడీ అవుతూ ఉంటారు. ఇదే విషయం మీద చాలామంది జోకులు కూడా పేలుస్తూ ఉంటారు. ఆడవాళ్ళు రెడీ అవ్వడం మొదలు పెడితే ఇప్పట్లో తెమిలే పని కాదని మగవాళ్ళకు గడ్డాలు మీసాలు కూడా పెరిగిపోతాయని ఇలా రకరకాల విధాలుగా కామెంట్లు చేస్తుంటారు.

 తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ పక్కన పార్క్ చేసిన ఒక కారు కనిపిస్తోంది.  అయితే ఆ బిల్డింగ్ మీద అలాగే కారు మీద ఒక పచ్చటి పాదు కూడా కనిపిస్తోంది. అయితే తన భార్య బయటికి వెళ్లడానికి రెడీ అవుతుంటే కారు పార్కు చేసిన భర్త పరిస్థితి ఇది అంటూ ఆ ఫోటో మీద సరదాగా కామెంట్ చేశారు. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: