భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప‌ట్ట‌ణంలోని సీతారాంప‌ట్నం స‌బ్‌స్టేష‌న్ లో ఒక్క‌సారి మంట‌లు చెల‌రేగాయి.దీంతో అప్ర‌మ‌త్త‌మైన స‌బ్‌స్టేష‌న్ సిబ్బంది విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి..ఫైర్ స్టేష‌న్‌కు స‌మాచారమిచ్చారు. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న  నాలుగు ఫైరింజ‌న్లు ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.ఈ ప్ర‌మాదంతో చుట్టుప్ర‌క్క‌లా మండ‌లాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది.విద్యుత్ వైర్లు తెగి ట్రాన్స్‌ఫార్మ‌ర్ మీద‌ప‌డ‌టంతో మంట‌లు చేల‌రేగిన‌ట్లు సిబ్బంది తెలిపారు.భారీ అగ్నిప్ర‌మాదంతో స‌బ్ స్టేష‌న్ స‌గానికిపైగా కాలిపోయింది.అయితే ప్ర‌మాద స‌మయంలో విద్యుత్ స‌బ్‌స్టేస‌న్‌లో ఆరుగురు సిబ్బంది విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.ఎవ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: