ఈ రోజు మంచు లక్ష్మి కూతురు రు విద్యా నిర్వహణ(ఆపిల్) ఈరోజు 7వ పుట్టినరోజును  జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇప్పుడు నువ్వు ప్రపంచంలో రెక్కలు విప్పుకుని వెళ్లడం నేను చూస్తున్నాను. నీవు ఎదగడం ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు నా జీవితంలో గొప్ప క్షణం" అని పేర్కొంటూ తన కుటుంబంతో ఆపిల్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

అయితే ఇదే ఫోటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. "తన ప్రకాశం మరియు పరిపక్వతతో ఆపిల్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.  ఆమె ప్రశ్నించిన ప్రతిసారి..నాకు దిమ్మ తిరిగిపోతుంది. ఆపిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ రకుల్ పోస్ట్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: