హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యాప్ లో సేవలకు ఉదయం నుండి అంతరాయం ఏర్పడింది. దాంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ లో సేవలు నిలిచిపోవడంతో ఉదయం నుండి కస్టమర్లు ట్విట్టర్ లో బ్యాంక్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్పందించింది. మొబైల్ యాప్ లో నెలకొన్న సమస్యను తాము పరిశీలిస్తామని అప్పటివరకు నెట్ బ్యాంకింగ్ ను వినియోగించాలని కస్టమర్ లను కోరింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే అంతరాయం వెనక ఉన్న కారణాలు మాత్రం వెల్లడించలేదు. కానీ అంతరాయానికి క్షమాపణలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: