కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా కొన‌సాగుతుంది.అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప‌క్రియ చురుకుగా సాగుతుంది.ఇప్పటివరకు 25.69 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 25,67,21,069 డోసుల వ్యాక్సిన్ల ఉపయోగించిన‌ట్లు కేంద్రం పేర్కొంది.ఇంకా రాష్ట్రాల వ‌ద్ద 1.05 కోట్ల‌కుపైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది.రాబోయే రెండు, మూడు రోజుల్లో మ‌రో 47 లక్ష‌ల‌కుపైగా వ్యాక్సిన్లు రాష్ట్రాల‌కు పంప‌నున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.ఇటీవ‌ల వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అసంతృప్తి వ్య‌క్తం చేశాయి.ప్ర‌ధానంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాష్ట్రాల‌కు కేంద్రం వ్యాక్సిన్లు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు.దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఆయ‌న లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే.అయితే ప్ర‌ధాని మోడీ వ్యాక్సిన్లు విష‌యంలో రాష్ట్రాల‌కు భ‌రోసా క‌ల్పించారు. అన్ని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను కేంద్ర‌మే ఉచితంగా ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్లు ఇచ్చి మోడీ మాట నిల‌బెట్టుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: