తెలంగాణ రాష్ట్రాన్ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రాబోయే మూడురోజుల్లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్‌లోని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో భారీవ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. గంట‌కు 40 కిలోమీట‌ర్ల వేగంతో గాలుల‌తో కూడిన‌ వ‌ర్షం ప‌డుతుంద‌ని, రాష్ట్రంలోని తూర్పు, ప‌శ్చిమ ప్రాంతాల్లోని జిల్లాల్లో ఈ వ‌ర్ష ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపింది. జార్కండ్‌తోపాటు ఆ రాష్ట్రం చుట్టుప‌క్క‌ల ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావం తెలంగాణ‌పై ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: