రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఉద‌య‌ల‌క్ష్మీకి ఏపీ హైకోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది.గ‌తంలో  ఓ పీఈటీ అధ్యాప‌కుడు త‌నకు అన్యాయం జ‌రిగందంటూ హైకోర్టుని ఆశ్ర‌యించాడు. పిటిష‌న్‌ని విచారించిన హైకోర్టు పీఈటీకి న్యాయం చేయాల‌ని అప్ప‌టి ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఉద‌య‌ల‌క్ష్మీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే త‌మ ఆదేశాల‌ను అమ‌లుచేయ‌క‌పోవ‌డం కోర్టు ధిక్కార‌ణ‌గా ప‌రిగ‌ణించిన హైకోర్టు  ఉద‌య‌ల‌క్ష్మీకి నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌ని జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని హైకోర్టులో హాజరు పరచాలని గుంటూరు రూరల్ ఎస్పీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రస్తుత సీఎస్,గత ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాధ్ దాస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ias