పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లిలో కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌నా స్థ‌లాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ సంద‌ర్శించారు. ఈ కాల్పుల్లో మృతిచెందిన పార్థ‌సార‌ధిరెడ్డి, శివ‌ప్ర‌సాద‌రెడ్డి మ‌ధ్య ఆస్తి త‌గాదాలుండ‌టంవ‌ల్లే ఈ కాల్పులు జ‌రిగాయ‌ని ఎస్పీ వెల్ల‌డించారు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో శివ‌ప్ర‌సాద‌రెడ్డి తుపాకీతో పార్థ‌సార‌ధిరెడ్డిపై కాల్పులు జ‌ర‌ప‌గా అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. అనంత‌రం ప్ర‌సాద‌రెడ్డి కూడా తుపాకీతో త‌న‌ను తాను కాల్చుకున్నాడు. బంధువులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైసీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి కాల్పుల‌కు దారితీసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. న‌ల్ల‌పురెడ్డిప‌ల్లిలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిని ఎస్పీ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. కాల్పుల‌కు దారితీయ‌డానికి కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌సాద‌రెడ్డికి అస‌లు తుపాకీ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎక్క‌డ కొనుగోలు చేశారు? ఎవ‌రెవ‌రు స‌హ‌క‌రించారు? అనే కోణంలో ఈ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: