రాష్ట్రంలోని దేవ‌దాయ‌శాఖ‌కు చెందిన భూముల‌ను ఎలా అమ్ముతారంటూ ఏపీ హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. దేవదాయ‌శాఖ‌కు చెందిన భూముల‌ను బ‌హిరంగ వేలం వేయాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై  హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. కొవిడ్ క‌ల్లోలంతోపాటు రాష్ట్రంలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో బ‌హిరంగ వేలం ఎలా నిర్వ‌హిస్తార‌ని పిటిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. పిటిష‌న‌ర్ చెప్పిన‌దాని ప్ర‌కారం కొవిడ్ ఉండ‌గా బ‌హిరంగ‌వేలం ఎందుకు వేస్తున్నార‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. కొంత స‌మ‌యం కావాల‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది కోర‌గా కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను జులై ఏడోతేదీకి వాయిదా వేసింది. కృష్ణా జిల్లాలోని పెద్ద క‌ళ్లేప‌ల్లి గ్రామంలోని దేవాల‌యానికి సంబంధించిన భూముల‌ను బ‌హిరంగ వేలం వేయ‌డం కోసం ప్ర‌భుత్వం పిలిచిన టెండ‌ర్ల కోర్టు ర‌ద్దుచేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ అధీనంలో ఉన్న భూముల‌ను వేలం వేసి న‌గ‌దు స‌మ‌కూర్చుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోన్న త‌రుణంలోనే హైకోర్టులో ఈ కేసు దాఖ‌లైంది. విశాఖ‌ప‌ట్నంలోని భూముల‌ను అమ్మ‌కానికి పెడుతున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కూడా కేసులు దాఖ‌ల‌య్యే అవకాశం క‌న‌ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap