కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడే తగ్గు ముఖం పడుతుంది. కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతుంది. అంతే కాకుండా మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. అయితే ఇదే సమయంలో దేశంలో కరోనా డెల్టా వేరియంట్ ను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది గతంలో వచ్చిన కరోనా వేరియంట్ ల కంటే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ వేరియంట్ పై స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంని అంతర్జాతీయ రివ్యూ జర్నల్ లో ప్రచురించారు. గమలేయ సెంటర్ ఫర్ స్టడీ దీనిపై పరిశోధనలు జరిపినట్టు వెల్లడించారు. ఇలా ఉండగా స్పుత్నిక్- వి వ్యాక్సిన్ ను రష్యా దేశంలో తయారు చేశారు. ప్రస్తుతం భారత్ ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: