జులై మొద‌టివారంలో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌లు ఏయే తేదీల్లో నిర్వ‌హించేది, వాటికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డితో చ‌ర్చించి షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌న్నారు. అలాగే అదే నెల చివ‌రివారంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఇంట‌ర్‌, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయాలంటూ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ముఖ్య‌మంత్రి గ‌తంలోనే ప‌లు సంద‌ర్భాల్లో స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ మ‌ధ్య ఇప్ప‌టికే మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం సీబీఎస్ ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయ‌డంతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను ర‌ద్దుచేయాల‌ని కోరుతుండ‌గా ప్ర‌భుత్వం మాత్రం ఆల‌స్య‌మైనా స‌రే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంపై విద్యావంతులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: