తెలంగాణ భూముల అమ్మకం పై ఆర్థికమంత్రి హరీష్‌రావు వాదన అసంబద్ధంగా ఉంద‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌హిళానేత విజ‌య‌శాంతి విమ‌ర్శించారు. రాష్ట్రం స‌మైక్యంగా ఉన్న‌ప్పుడు తెలంగాణలో జ‌రుగుతున్న‌ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఆవిర్భ‌వించిందంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతుంటార‌ని, మ‌రి అటువంటి ధ‌నిక రాష్ట్రంలో భూముల అమ్మ‌డం ఏమిటి?  వేలం వేయ‌డం ఏమిటంటూ నిల‌దీశారు. దీనిపై కేసీఆర్ ప్ర‌జ‌లంద‌రికీ బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప్ర‌జ‌లు మ‌రో ఉద్య‌మానికి సిద్ధంగా ఉన్నార‌ని విష‌యాన్ని గుర్తెర‌గాల‌న్నారు. రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేక భూముల‌మ్మే ప‌రిస్థితి తెచ్చార‌ని, అటువంటి ప‌రిస్థితుల్లో కోట్ల‌రూపాయ‌ల విలువైన కార్ల పంపిణీ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఉన్న జైళ్లు కూల్చుడెందుకు?  కోట్ల‌రూపాయ‌ల ప్ర‌చార ఖ‌ర్చులెందుకు? స‌చివాల‌యానికే రాని ముఖ్య‌మంత్రికి కొత్త భ‌వ‌నాల‌నెందుకంటూ ఘాటుగా విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: