కరోనా టీకాల కోసం ఆన్‌లైన్ న‌మోదు త‌ప్పనిస‌రికాద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం క‌రోనా టీకాలు వేయించుకోవాలంటే ఆన్‌లైన్‌లో వివ‌రాలు న‌మోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.అయితే తాజ‌గా కేంద్ర ఆరోగ్య‌శాఖ వీటికి చెక్‌పెట్టింది. ఆన్‌లైన్‌లో నమోదు కాక‌పోయిన క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చాని తెలిపింది.ఆన్‌సైట్ రిజిస్ట్రేష‌న్ ద్వారా ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు,ఆశావ‌ర్క‌ర్లు గ్రామీణ ప్రాంతాల్లో ల‌బ్దిదారుల‌ను స‌మీక‌రిస్తార‌ని తెలిపింది.జూన్ 13 వ‌ర‌కు కోవిన్ యాప్‌లో న‌మోదైన 28.36 కోట్ల మంది ల‌బ్దిదారుల్లో 16.45 కోట్లు(58 శాతం) ల‌బ్దిదారులు ఆన్‌సైట్ మోడ్‌లోనే న‌మోదు చేయ‌బడ్డార‌ని తెలిపింది. జూన్ 13 వరకు కో-విన్‌లో నమోదైన మొత్తం 24.84 కోట్ల వ్యాక్సిన్ మోతాదులలో 19.84 కోట్ల మోతాదులు (దాదాపు 80 శాతం) ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ల ద్వారా నిర్వహించబడుతున్నాయని ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: