జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ యాసను కించపరిచారంటూ తెలంగాణ జాగృతి సభ్యులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. వీడియో లో హైపర్ ఆది మాట్లాడుతూ... తమ షోలో ఏపీ, తెలంగాణ అనే బేధాభిప్రాయాలు లేవని చెప్పారు. తామంతా కలిసి చాలా సరదాగా స్కిట్ లు చేస్తామని అన్నారు.

ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి పరిష్కరించుకుంటాం అని తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించడం వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. అయితే రీసెంట్ గా చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ స్కిట్ లో గౌరమ్మ, బతుకమ్మ పాటల పై చేసిన సన్నివేశాలపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయని... ఆ స్కిట్ వాంటెడ్ గా చేసింది కాదని అన్నారు. జరిగిన తప్పుకు తన తరుపున, స్టేజ్ పై ఉన్న టీం సభ్యుల తరపున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: