జబర్దస్త్ నటుడు హైపర్ ఆది "శ్రీదేవి డ్రామా కంపెనీ" అనే టీవీ షోలో చేసిన స్కిట్ వివాదాస్పదమైంది. స్కిట్  బతుకమ్మను, గౌరమ్మను అవమానించేలా ఉండటంతో తెలంగాణ జాగృతి కి చెందిన సభ్యులు ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆది మీడియా ముందుకు వచ్చి... స్కిట్ లో తప్పుగా మాట్లాడినట్టు ఆరోపణలు వస్తున్నాయని... అందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఏపీ, తెలంగాణ ఇలాంటి భేదాభిప్రాయాలు తమకు లేవని అన్నారు. కాగా తాజాగా జాగృతి నేతలు మరోసారి ఆది పై ఫైర్ అయ్యారు. హైపర్ ఆది క్షమాపణ లు చెప్పినా వదలమని స్పష్టం చేశారు. హైపర్ ఆది బాధపెట్టి క్షమాపణలు చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. 

రంగారెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... హైపర్ ఆది సంస్కృతిని కించపరిచినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా... ఆరోపణలు వస్తున్నాయని అందుకే క్షమాపణలు చెబుతున్నా అని వ్యాఖ్యానించారని అన్నారు. ఇప్పటికీ కూడా హైపర్ ఆది పశ్చాత్తాపడటం లేదని అన్నారు.. కేవలం తప్పించుకునే దూరంలోనే క్షమాపణలు చెప్పారని అన్నారు. ఆది కి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: