కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో రిటైనింగ్ వాల్ ప‌నుల‌ను ప్రారంభించామ‌ని తూర్పు నియోజ‌క‌వర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.ప‌రివాహ‌క‌ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన 524 మంద‌కి ఇల్లు అందిస్తున్నామ‌ని తెలిపారు.ఒక్కో ఇంటికోసం ప్ర‌భుత్వం రూ.5.40 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింద‌ని.. మొత్తం 25 కోట్లు విలువ చేసే ఇళ్ల‌ని ఉచితంగా అందిస్తున్నామ‌న్నారు.అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నార‌ని అవినాష్ తెలిపారు.రెండేళ్ల‌లో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు మ‌రింత విశ్వాసం పెరిగింద‌ని తెలిపారు. కృష్ణాన‌ది ప‌రివాహ‌క‌ప్రాంతంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.అందులో ప్ర‌ధానంగా వ‌ర‌ద ముంపు స‌మ‌స్య‌. ప్ర‌తి ఏడాది క‌ష్ణాన‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు క‌ష్ణాప‌రివాహ‌క ప్రాంతంలోని ఇళ్లు అన్ని నీట‌మునిగి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌ర‌ద‌లు ఉన్న స‌మ‌యంలో వారంద‌రిని పున‌రావాస‌కేంద్రాల‌కు త‌ర‌లిస్తారు.అయితే దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌ని ప్ర‌భుత్వం భావించింది.రిటైనింగ్ వాల్ వ‌ల్ల వ‌ర‌ద ముప్పుని అరిక‌ట్ట‌వ‌చ్చిన భావించిన సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిధులు విడుద‌ల చేసి శంకుస్థాప‌న చేశారు.ఈ రోజు నుంచి రిటైనింగ్ వాల్ ప‌నులు ప్రారంభం అవుతున్నాయి. ఈ వాల్ నిర్మాణం పూర్త‌యితే వ‌ర‌ద ముంపు త‌గ్గే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: