రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌గా నీలం సాహ్ని నియామ‌కాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది.ఈ పిటిష‌న్‌పై హైకోర్టు ఈ రోజు విచార‌ణ జ‌రిపింది.ఈ పిటిష‌న్‌కు సంబంధించి స‌మాచారం స‌మ‌గ్రంగా లేద‌ని పిటిష‌న‌ర్‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్నిని తొలగించాలని విజయవాడ కి చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కోసం సూచించిన ముగ్గురు పేర్లు రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్ పేర్కొన్నారు. ఎస్ఈసీగా మాజీ  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని నియ‌మిస్తూ ఇచ్చిన జీవో 20ని ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ కోరారు.ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయవాది మరికొన్ని అడిషనల్ మెటీరియల్ దాఖలు చేయడానికి సమయం కొరగా హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చేవారానికి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: