రోజురోజుకూ సైబర్‌క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయ‌ని, వాటిని అరిక‌ట్టేందుకు తెలంగాణ పోలీసుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ అన్నారు. హైద‌రాబాద్‌లోని సంజీవ‌రెడ్డిన‌గ‌ర్ నూత‌న పోలీస్‌స్టేష‌న్ భ‌వ‌నాన్ని ఆయ‌న  ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, నగ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్,  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. దేశంలోని పోలీసు వ్య‌వ‌స్థ‌కు ఆద‌ర్శంగా తెలంగాణ పోలీస్ నిల‌వ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన క‌మాండ్ కంట్రోల్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మారుతున్న ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పోలీస్ వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని, ఆరు ల‌క్ష‌ల సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు గ్లోబ‌ల్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు డీజీపీ చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డంలో పంజాగుట్ట పోలీసులు దేశంలోనే రెండోస్థానంలో నిలిచార‌ని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag