కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కోన‌సీమ‌లా మార‌బోతోందంటూ తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కెటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న‌ట్లే సిరిసిల్ల‌లో కూడా గ‌జం రూ.ల‌క్ష ప‌లుకుతోంద‌న్నారు. మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డితో క‌లిసి కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం రాచ‌ర్ల‌బొప్పాపూర్‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించారు. ల‌బ్ధిదారులెవ‌రూ పైసా లంచం ఇచ్చే ప‌రిస్థితి లేకుండా ఒక‌టికి రెండుసార్లు పూర్తిస్థాయిలో విచారించి ఇళ్లు కేటాయించామ‌ని, కోట్ల‌రూపాయ‌ల విలువైన భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఘ‌ట‌న ఒక్క కేసీఆర్‌దేన‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ కింద ప్ర‌తి ఇంటికి ఒక న‌ల్లాను ఏర్పాటు చేశామ‌న్నారు. త్వ‌ర‌లోనే నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్‌కార్డులు ఇవ్వ‌బోతున్నామ‌ని, పేద‌వారి ముఖంలో సంతోషం చూడ‌ట‌మే కేసీఆర్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో టీఆర్ ఎస్ నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag