హైదరాబాద్ లో తిమింగళం వాంతి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్‌(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్‌ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ మోసాలు చేస్తున్నట్టు వారు పోలీసులు గుర్తించారు.


 ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గదినే ఆఫీస్ గా మార్చుకుని మోసాలకు తెగబడ్డారు. ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఏడుగురు‌ నిందితులను అదుపులోకి‌ తీసుకున్నారు. అలా అదుపులోకి తీసుకున్న వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: