స్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరిక‌న్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది. జులై నాలుగోతేదీన భారీగా వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డంద్వారా వైర‌స్ నుంచి విముక్తి పొందామ‌నే సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డంతోపాటు వారిలో ఆత్మ‌విశ్వ‌సాన్ని క‌లిగించాల‌ని అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. వైర‌స్‌కు ప్ర‌భావిత‌మైన దేశాల్లో అమెరికా మొద‌టిస్థానంలో ఉంది. వైట్‌హౌస్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో కొవిడ్‌పై పోరాటం జ‌రిపినవారిని స‌త్క‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో మాస్క్‌లు కూడా ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను స‌డ‌లించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రెస్టారెంట్లు, ధియేట‌ర్లు, బార్లు, వాణిజ్య సంస్థ‌లు అన్నీ తిరిగి తెరుచుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag