హుజురాబాద్‌లో ఎన్నిక‌ల వాతావ‌రణం నెల‌కొంది.టీఆర్ఎస్ పార్టీకి,ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన మ‌రుస‌టి రోజే హుజురాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు.ఈ రోజు భారీ ర్యాలీతో హ‌జురాబాద్‌లో ఈట‌ల ప‌ర్య‌టించారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారిని ఇంటెలిజెన్స్ అధికారులు వేధిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.హుజురాబాద్ ప్ర‌జ‌లు ప్రేమ‌కు లొంగుతారు త‌ప్ప వేధింపుల‌కు లొంగ‌ర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న అనుచరుల్ని వేధిస్తే చూస్తూ ఊరుకోన‌ని హెచ్చ‌రించారు.చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతున్న మంత్రుల‌కు టీఆర్ఎస్‌లో ఆత్మ‌గౌర‌వం ఉందా అని ఈట‌ల ప్ర‌శ్నించారు.2024లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు హుజురాబాద్ ఉప ఎన్నికే రిహార్స‌ల్ అని తెలిపారు.ఆత్మ‌గౌర‌వ పోరాటానికి హుజురాబాద్ వేదికకాబోతుంద‌ని...రేప‌టి నుంచే ఇంటింటికి వెళ్తాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: