కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.క‌రోనా సంక్షోభానికి ప్ర‌భావిత‌మైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పేరుతో ప్ర‌క‌టించిన ప్యాకేజీ వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ప్ర‌ధాని మోడీ 20ల‌క్ష‌ల కోట్ల‌తో ప్యాకేజీ ప్ర‌క‌టించి ఏడాది కావోస్తుంద‌ని లేఖ‌లో ప్ర‌స్తావించారు.కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీలో ఎమ్ఎస్ఎంఈల‌కు సంబంధించిన గ్యారెంటేడ్ ఎమ‌ర్జెన్నీక్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు కేటాయించిన‌ప్ప‌టికి వాటికి మార్గ‌ద‌ర్శ‌కాలు వెలువ‌డ‌లేద‌ని కేటీఆర్ పేర్కోన్నారు.క‌రోనా సంక్షోభం ద్వారా క‌లిగిన న‌ష్టాల‌ను భ‌రించేలా భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వ‌డం ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈల‌ను ఆదుకోవ‌చ్చ‌ని భావిస్తున్నామ‌ని...అయితే సంవ‌త్స‌రానికిపైగా సంక్షోభంలో ఉన్న వీటికి ఈ రోజుకి కూడా స‌ప్లై చైన్ డిస్ట్రిబ్యూష‌న్‌,తీవ్ర‌మైన లెబ‌ర్ కొర‌త ఎదుర్కోంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కోన్నారు.ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ స‌హాయ ప్యాకేజీలో రుణ‌భారంతో స‌త‌మ‌త‌వుతున్న ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లు కోసం మ‌రో రెండు ప‌థ‌కాలను ప్రారంభించిన ప్ర‌యోజ‌నం లేద‌ని మంత్రి కేటీఆర్ లేఖ‌లో పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: