ప్రస్తుతం కొంతమంది యూట్యూబ్ లో ఛానల్స్ పెట్టుకుని ఫేమస్ అవుతున్నారు. అయితే ఎలా ఫేమస్ అవ్వాలని తెలియనివారు బూతులు మాట్లాడుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా యూట్యూబ్ లో పబ్జి ఆడుతూ బూతులు మాట్లాడే జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన మదన్ ఆయన భార్య కృతిక కలిసి  యూట్యూబ్ లో పబ్ జీ లైవ్ స్ట్రీమింగ్ ఆడుతుంటారు.

ఛానల్ కు 8 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్ లు ఉన్నారు వారిలో ఎక్కువ మంది మైనర్లే కావడం ఆశ్చర్యకరం  అయితే ఈ జంట అందరిలా పబ్జి ఆడకుండా యువతను చెడదారి. పట్టించే విధంగా ఆడుతున్నారు. మదన్ యాంగ్రీ ఎట్ హీస్ గర్ల్ ఫ్రెండ్, స్ట్రిక్ట్ లీ 18 ప్లస్ అనే వీడియోలు చేసి అందులో మహిళలపై అసభ్య కామెంట్లు చేశారు. దాంతో చెన్నై కి చెందిన ఓ వ్యక్తి వీరిపై కంప్లైంట్ ఇవ్వడం తో ఇద్దరినీ అరెస్ట్ పోలీసులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: