తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ అమలు చేయాలా..? వద్దా.. ? లేదంటే నైట్ కర్ఫ్యూ విధించాలా అనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు .

అయితే మరో పదిరోజులు రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు  వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ సంబంధిత అంశాల గురించి చర్చించనున్నారు . గోదావరి జలాల అంశంపై కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చించనున్నారు .  దాంతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక పై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: