నేటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనున్న నేపధ్యంలో మధ్యాన్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ అత్యవసర సమావేశం కాబోతోంది. అయితే అన్ లాక్ దిశగా దేశంలోని అనేక రాష్ట్రాలు వెళుతున్న క్రమంలో అదే తరహాలో తెలంగాణ కూడా పయనించే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన జులై ఫస్ట్ నుండి యాబై శాతం ఆక్యుపెన్సీ తో సినిమా హాళ్లు , బార్లు , జిమ్ లకు అనుమతి ఇవ్వనున్నారని అంటున్నారు. 



అలాగే రేపటి నుంచి నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం, ఆకస్మిక తనిఖీలు కూడా సీఎం చేపట్టనున్న క్రమంలో ఢిల్లీ తరహా అన్ లాక్ విధించేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. రాత్రి 9 నుండి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్హ్యూ మాత్రమే కొనసాగించే యోచనలో ప్రభ్త్వం ఉందని అంటున్నారు. అన్ లాక్ అంశంతో పాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు మొదలు గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాల పై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: