చాలా కాలం తరువాత టీటీడీ పాలకమండలి సమావేశం జరగబోతోంది. తాజాగా ఈ అంశం మీద పలు కీలక అంశాలు వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా వలన పాలకమండలి సమావేశాలను సక్రమంగా నిర్వహించలేక పోయామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడాలని ఏడాదిన్నర కాలంగా తిరుమలలో అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఇక తిరుపతి నుంచి గరుడ వారధి నిర్మాణ పనులను అలిపిరి వరకు పొడిగింపు ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారన్న ఆయన ఈరోజు జరగబోతున్న పాలకమండలి సమావేశంలో అనేక కీలక అంశాల పై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. శ్రీవారికీ శాశ్వతంగా గో ఆధారిత నైవేద్యాని సమర్పించేందుకు సమాకుర్చుకోవాల్సిన వనరుల గురించి కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd