టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణిని సోమవారం నుంచి ప్రారంభిస్తాం అని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా టీటీడీలోని 35మంది శాశ్వత ఉద్యోగులు...100మంది రిటైర్డ్ ఉద్యోగులు...10 మంది కాంట్రాక్టు సిబ్బంది మరణించారని ఆయన వెల్లడించారు. 

అందుకే టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఆనందయ్య మందును ఇస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు. టీటీడీలోని ఉద్యోగులు వారీ కుటుంబ సభ్యులకు లక్షమందికి సరిపడేలా ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు. ఇక మరో పక్క ఆనందయ్య కూడా మందు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd