ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు పెద్ద ప్ర‌హ‌స‌నంలా మారాయి. యేడాది క్రింద‌టే ఈ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. యేడాది పాటు ఆ నోటిఫికేష‌న్ అలాగే కంటిన్యూ అయ్యింది. ఎట్ట‌కేల‌కు నీలం సాహ్నీ ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా వ‌చ్చిన వెంట‌నే వారం రోజుల్లోనే ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో హైకోర్టు ట్విస్ట్ ఇచ్చి వాయిదా వేసింది. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ పై అప్పీల్‌కు వెళ్ల‌డంతో ఏం జ‌రుగుతుందా ? అన్న ఆస‌క్తి ఏర్ప‌డింది.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు చెప్ప‌డంతో వైసీపీ వ‌ర్గాల‌కు పెద్ద షాకే త‌గిలింది. మ‌రి ఇప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఎలాంటి తీర్పు వ‌స్తుందా ? అన్న ఆస‌క్తి నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: