తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఒక‌రు. గ‌తంలో ప‌ర‌వాడ‌, ఆ త‌ర్వాత పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతో పాటు గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. వివాద ర‌హితుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న కుమారుడు, టీడీపీ యువ‌నేత బండారు అప్ప‌ల నాయుడు ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

తండ్రిగా ప్రేమించారు గురువుగా దండించాడు మనిషిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలని నేర్పించారు, నాకు జన్మనిచ్చి సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు కల్పించిన మీకు చెడ్డ పేరు రాకుండా మీరు చూపిన మార్గంలో నడవడం నా బాధ్యతగా ఎల్లప్ప భావిస్తానని తెలియజేస్తూ!! జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారు. అని అప్ప‌నాయుడు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇక టీడీపీ యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు బండారుకు రెండో అల్లుడు అన్న విష‌యం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: