ఓ చిన్న గ‌ది క‌ట్టాలంటేనే ఎవ‌రికి అయినా వారం రోజులు ప‌డుతుంది. ఇంకా ఎంత స్పీడ్ గా చేసినా కూడా రెండు, మూడు రోజులు లేనిదే ఓ గ‌ది క‌ట్ట‌డం జ‌ర‌గ‌దు. కానీ ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 10 అంత‌స్తుల భ‌వ‌నాన్ని కేవ‌లం 28 గంట‌ల్లో పూర్తి చేసి స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేశారు చైనీయులు. ఈ ఘ‌న‌త చైనాకు చెందిన ఓ కంపెనీ సాధించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ ఈ రికార్డు సాధించింది.

అయితే ఈ ప‌ది అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌(ముందుగా నిర్మించిన) కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని వాడారు. ముందుగానే అట్ట పెట్టెల లాంటి గ‌దులు ఉంటాయి. వీటిని ట్ర‌క్క‌ర్ల‌లో తీసుకు వ‌చ్చి వీటిని బోల్ట్స్‌తో బిగించు కుంటూ వ‌స్తారు. ఆ త‌ర్వాత క‌రెంట్‌, వాట‌ర్ క‌నెక్ష‌న్ ఇస్తారు. ఇంత‌కు ఈ 10 అంత‌స్తుల భ‌వ‌నం మ‌నుష్యులు నివ‌సించేందుకే నిర్మించారు. ఈ భ‌వ‌న‌ నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: