ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో అంచ‌నాలు, ఆశ‌ల‌తో ఎంతో మంది తీవ్ర ఉత్కంఠా కొద్ది నెల‌లుగా ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్ కోసం వెయిట్ చేశారు. ప్ర‌పంచ క‌ప్ సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్‌, భార‌త జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగిన మ్యాచ్‌కు ముందు కూడా వ‌ర్షం కురిసింది. చివ‌ర‌కు రెండో రోజు జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ గ‌ట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. ఇక ఇప్పుడు అదే జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా టెస్ట్ చాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్ జ‌రుగుతుండ‌డంతో అంద‌రూ ఆస‌క్తితో ఉన్నారు. అయితే తొలి రోజు ఆట వ‌రుణుడు ఆడేశాడు. ఇక రెండో రోజు ప‌రిస్థితి ఏంట‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు అయితే క్లారిటీ లేదు. అయితే ఉన్నంత‌లో బెట‌ర్ ఏంటంటే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు శ‌నివారం వాతావ‌ర‌ణం కాస్త పొడిబారి ఉంది. అయితే మ‌ధ్యాహ్నం, సాయంత్రం వ‌ర్షం కురిసే అవ‌కాశాన్ని కొట్టి ప‌డేయ‌లేమ‌ని స్థానిక వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: