దేశ‌వ్యాప్తంగా ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, ప‌శ్చిమ బెంగాల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం వ‌రుస‌గా కోర్టుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌దే ప‌దే కోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతున్నా వీరి తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా మ‌మ‌త ప్ర‌భుత్వంపై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల అనంతరం హింసాకాండ చెల‌రేగింది. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించార‌ని.. వీటిపై వ‌చ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేద‌ని ప్ర‌శ్నించింది. ఈ హింసాకాండపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషకు సూచించింది. ఇక కోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీకి ఆటంకాలు క‌లిగిస్తే కోర్టు ధిక్కారం క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: