హీరోయిన్ చాందినిని మోసం చేసిన కేసులో మాజీ మంత్రి మణికందన్ చుట్టూ మ‌రింత గ‌ట్టి ఉచ్చు బిగుస్తోంది. త‌న‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి గ‌ర్భ‌వ‌తిని కూడా చేశాడ‌ని చాందిని ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 2017లో ఆయనతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమగా మారిందని... మణికందన్ కు ఇంతకుముందే పెళ్లయినా.. తనను కూడా పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించాడని ఆరోపించింది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్న ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని చాందిని చెపుతోంది. త‌నకు గర్భం  వ‌స్తే బ‌ల‌వంతంగా అబార్ష‌న్ చేయించాడ‌ని.. పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి చేస్తే బెదిరిస్తున్నాడ‌ని ఆమె వాపోయింది.

ఈ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌ణికంద‌న్ అజ్ఞాతంలో ఉండ‌డంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఆయ‌న‌ బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు బెయిల్ ఇవ్వకూడదని కోర‌డంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు ప్ర‌త్యేక టీంతో ఆయ‌న కోసం వెతుకుతున్నా ఆయ‌న మాత్రం అజ్ఞాతం వీడి రావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: