ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ పై పోరాడేందుకు ఇండియా వ్యాక్సినేష‌న్ పై దృష్టిపెట్టింది. తొలి వేవ్ త‌ర్వాత నిర్ల‌క్ష్యంగా ఉండ‌డంతో సెకండ్ వేవ్ నేర్పిన పాఠాల త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని భారీగా పెంచుతోంది. ఇక కొత్త వ్యాక్సిన్ల కోసం కూడా ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అలాగే నోవావాక్స్ అనే అమెరిక‌న్ కంపెనీ త‌యారు చేస్తున్న కోవోవాక్స్ అనే వ్యాక్సిన్ సెప్టెంబ‌ర్ నుంచి ఇండియాలో అందుబాటులోకి తెచ్చే ప్లానింగ్ కూడా ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోవిషీల్డ్ ఉత్ప‌త్తి చేస్తున్న సీరం సంస్థ ఈ కోవోవాక్స్ ను కూడా ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఫేజ్ - 3 ట్ర‌య‌ల్స్ వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని చెపుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: