ప్ర‌పంచ క‌ప్ టెస్ట్ చాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్ రెండో రోజు ప్రారంభ‌మైంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ టాస్ గెలిచి భార‌త్ జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భార‌త ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్‌ను కీవీ పేస్ బౌల‌ర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్ట‌లేక‌పోయారు. రోహిత్‌, గిల్ ప్ర‌శాంతంగా త‌మ ఆట ఆడుకున్నారు. దీంతో భార‌త్‌కు 10 ఓవ‌ర్ల‌లోనే 40 ప‌రుగులు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత మాత్రం పిచ్ కాస్త ట‌ర్న్ అయిన‌ట్టే అనిపించింది. నిన్న వ‌ర్షానికి పిచ్ త‌డిసిపోవ‌డంతో జారుతోంది. ఫీల్డ‌ర్లు ఫీల్డింగ్‌లో మ‌రింత ఎలెర్ట్‌గా ఉండాల్సి ఉంది. ర‌న్ అవుట్, క్యాచ్‌ల విష‌యంలో వారు ఎలెర్ట్ గా లేక‌పోతే జారే ఛాన్స్ ఉంది. ఇవే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయ‌న‌డంలో సందేహం లేదు. కీవీస్ కీప‌ర్ కూడా జారిప‌డ్డాడు. ఇటు భార‌త ఓపెన‌ర్లు కూడా జ‌రుగుతోన్న పిచ్‌పై ఏకాగ్ర‌తతో బ్యాటింగ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: