సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కొత్త బంతిని ఇద్దరూ కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రోహిత్, గిల్ ఇద్దరూ కూడా స్వేచ్చగా షాట్ లు ఆడటమే కాకుండా స్వింగ్ అవుతున్న బంతుల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక రోహిత్ టార్గెట్ గా న్యూజిలాండ్ పేసర్లు బంతులు విసురుతున్నారు.

అయితే ఇక్కడ రోహిత్ ఎల్బీడబ్ల్యూ లో బ్రతికిపోయాడు. గ్రాండ్ హోం విసిరినా బంతిని ఎదుర్కొనే క్రమంలో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ అయి ప్యాడ్స్ ని తాకింది. ఈ విషయం ఆల్ట్రా ఎడ్జ్ లో క్లియర్ గా కనపడింది. అయితే కివీస్ బౌలర్ నమ్మకంగా అప్పీల్ చేయడంతో విలియమ్సన్ రివ్యూ కోరగా బంతి బ్యాట్ కి తగలడంతో నాట్ అవుట్ గా ప్రకటించారు. ప్రస్తుతం 20 ఓవర్లకు ఇండియా వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది.జేమిసన్ బౌలింగ్ లో స్లిప్ లో సౌతీ కి క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుతిరిగాడు. 68 బంతుల్లో ఆరు ఫోర్లతో 34 పరుగులు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: