లాక్‌డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు ఇస్తున్న రాష్ట్రాల‌పై కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది.క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని స‌మీక్షించిన  అంతా స‌క్ర‌మంగా ఉన్న‌త‌రువాత మాత్ర‌మే ఆంక్ష‌ల స‌డ‌లింపుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రం అభిప్రాయ‌ప‌డింది. ఆంక్ష‌ల స‌డ‌లింపుల‌పై ప‌లు సూచ‌న‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్ర హోంశాఖ లేఖ‌లు పంపింది.కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌లు స‌డ‌లింపులు మార్కెట్ల‌ను ర‌ద్దీగా మారుస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.ఇబ్బందిప‌డ‌కుండా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రమ‌ని కేంద్ర హోంశాఖ లేఖ‌లో పేర్కొంది.

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తివేయాల‌ని క్యాబినేట్ నిర్ణ‌యం తీసుకుంది.తెలంగాణ‌లో కేసులు భారీగా త‌గ్గ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.కేసులు లేన‌ప్ప‌టికి ఆంక్ష‌లు స‌డ‌లింపులు ఇవ్వ‌డం అంత‌మంచిదికాద‌ని నిపుణ‌లు భావిస్తున్నారు.ఇటు ఏపీ ప్ర‌భుత్వం కూడా  ఈ నెల 21 నుంచి ఆంక్ష‌ల‌ను స‌డ‌లింపు ఇస్తుంది.అయితే ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణ‌యాన్ని కేంద్ర హోంశాఖ తప్పుబ‌డుతుంది. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ల‌ను పూర్తిగా ఎత్తివేయ‌కుండా కొన్ని ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయాల‌ని హోంశాఖ రాష్ట్రాల‌కు సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: