న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో తొలి సెషన్ ముగిసింది. న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక టీం ఇండియా ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పినా సరే కీలకమైన సమయంలో వికెట్ కాపాడుకోలేకపోయారు. ధాటిగా ఆడటమే కొంప ముంచింది అని చెప్పాలి.

అయితే మొదటి సెషన్ లో ఆధిపత్యం ఎవరిది అంటే... ఇద్దరికీ సమానంగానే చెప్పొచ్చు. 10 ఓవర్ల వరకు కాస్త టీం ఇండియా దూకుడుగా కనపడినా తర్వాత నుంచి మాత్రం కాస్త వెనుకబడింది అనే చెప్పాలి. న్యూజిలాండ్ పక్కగా బౌలింగ్ చేయడంతో తొలి పది ఓవర్లలో 40 పరుగులు చేసిన టీం ఇండియా... తర్వాత 18 ఓవర్లకు కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్ లు  కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: