తెలంగాణ ప్ర‌భుత్వం జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌న‌డం స‌రికాద‌ని సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఈ నిర్ణ‌యం స‌రైందికాద‌ని, ఒక‌వేళ పాఠ‌శాల‌ను పునఃప్రారంభించాలంటే విద్యార్థులంద‌రికీ టీకా ఇవ్వాల‌ని కోరారు. అక్టోబ‌రు నుంచి క‌రోనా మూడోద‌శ ప్ర‌భావం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని, పిల్ల‌ల‌కు ఎక్కువ ప్ర‌మాదం పొంచివుందంటున్నార‌ని, దీన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌మైంద‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ఎటువంటి జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం పొంచివుంటుంద‌ని, ఈ త‌రుణంలో పాఠ‌శాల‌ల ప్రారంభంపై ఒక‌సారి పునార‌లోచించాల‌ని భ‌ట్టి కోరారు. కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం రేప‌టినుంచి లాక్‌డౌన్ ఎత్తేస్తోంది. దేశ‌వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లోను మ‌హ‌మ్మారి అదుపులోకి రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా వ‌చ్చే నెల ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌తిప‌క్షాల‌తోపాటు ప‌లువురు విద్యావేత్త‌లు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag