ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ న‌మ్మిన‌బంటు, మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శ‌ర్మ‌కు భార‌తీయ జ‌న‌తాపార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ‌కు ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌కముందు ఏడాదిన్న‌ర‌కు పైగా ప్ర‌ధాన‌మంత్రి మోడీ బృందంగా ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు అవ‌కాశాలు దాదాపు మృగ్య‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌యోగం చేస్తోంది. ముఖ్య‌మంత్రి యోగిపై బ్రాహ్మ‌ణులు వ్య‌తిరేకంగా ఉండ‌టంతో ఏకేశ‌ర్మ‌కు ప‌ద‌వి ద‌క్కిన‌ట్లు భావిస్తున్నారు. మంత్రిప‌ద‌వి అప్ప‌జెబుతారంటూ ఊహాగానాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని తోసిరాజంటూ పార్టీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జితిన్ ప్ర‌సాద‌ను పార్టీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు బ్రాహ్మ‌ణ నేత‌ల‌ను తీసుకోవ‌డంతో బీజేపీ యూపీలో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag