రివ్యూల విషయంలో కాస్త టెస్ట్ క్రికెట్ లో వివాదాలు నడుస్తూ ఉంటాయి. రివ్యూకి సంబంధించి కెప్టెన్ అప్పీల్ చేసే విషయంలో సమయం అయిపోవడం లేకపోతే అంపైర్ లు కెప్టెన్ రివ్యూ ఇవ్వకపోయినా ఇచ్చారు అనుకుని రివ్యూలు ఇవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. తాజాగా న్యూజిలాండ్ ఇండియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

40 ఓవర్ చివరి బంతికి బౌల్ట్... కోహ్లీకి బౌలింగ్ చేసే క్రమంలో కీపర్ చేతిలో బాల్ పడటం ఆ తర్వాత అంపైర్ రివ్యూ ఇవ్వడం జరిగాయి. అయితే ఇక్కడ న్యూజిలాండ్ రివ్యూ ఇవ్వకుండా లెగ్ సైడ్ అంపైర్ రిచర్డ్ రివ్యూ కి వెళ్ళారు. రివ్యూ టైం అయిపోయిన తర్వాత అంపైర్ ఆ నిర్ణయం తీసుకోవడం న్యూజిలాండ్ ఇవ్వకపోవడంతో కోహ్లీ అంపైర్ తో వాగ్వాదానికి దిగినట్టుగా కనపడింది. అయితే న్యూజిలాండ్ రివ్యూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ  ఆ జట్టు రివ్యూ కోల్పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: