హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌(హెచ్‌సీఏ)లో మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. అధ్య‌క్ష‌ప‌ద‌వి నుంచి అజారుద్దీన్‌ని అపెక్స్ కౌన్సిల్ స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న రెండురోజుల్లో మ‌రో వివాదాన్ని అజర్ తెర‌పైకి తెచ్చారు.అద్య‌క్ష‌ప‌ద‌విలో కొన‌సాగేందుకు ఆయ‌న కొత్త ఎత్తులు వేస్తున్నారు.ఈ రోజు అజారుద్దీన్ ఏజీయంలో ఆరుగురికి కొత్త‌గా చోటు క‌ల్పించారు.వీరికి జిల్లా కోటాలో అజారుద్దీన్ మెంబ‌ర్షిప్ ఇచ్చారు.దీనిపై అపెక్స్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది.ఏ హోదాలో వారిని నియ‌మించారంటూ అజారుద్దీన్‌ని అపెక్స్ కౌన్సిల్ ప్ర‌శ్నించింది.అజారుద్దీన్‌పై హెచ్‌సీఏ మాజీ సెక్ర‌ట‌రీ శేష్ నారాయ‌ణ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. మూడు సంవ‌త్స‌రాల నుంచి బీసీసీఐ ద్వారా 45 కోట్ల రూపాయ‌లు హెచ్‌సీఏకి వ‌చ్చాయ‌ని...ఆ డ‌బ్బులు ఏమైయ్యాయో అజారుద్దీన్ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.అజారుద్దీన్‌కి పిచ్చి ప‌ట్టి ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్‌లో మెజార్టీ స‌భ్యులు ఆయ‌న‌న్ని స‌స్పెండ్ చేస్తే నియ‌మ‌కాలు ఎలా చేస్తార‌ని శేష్ నారాయ‌ణ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hca