ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రెండు జట్లు కూడా కాస్త గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితే కనపడుతుంది. పిచ్ బ్యాటింగ్ కి గాని బౌలింగ్ కి గాని అనుకూలంగా కనపడటం లేదు. ముందు బ్యాటింగ్ కి అనుకూలంగా కనపడినా సరే ఆ తర్వాత బౌలింగ్ కి సహకరిస్తుంది. అయితే వికెట్ లు మాత్రం పడకపోవడంతో న్యూజిలాండ్ బౌలర్ లు ఇబ్బంది పడుతున్నారు.

టీం ఇండియా మూడు వికెట్ లు పడిన తర్వాత జాగ్రత్తగా ఆడింది. కోహ్లీ, రహానే వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. టీం ఇండియా  కెప్టెన్ కోహ్లీ కాస్త జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ క్రీజ్ వదిలేసి ఆడుతున్నారు టీం ఇండియా బ్యాట్స్మెన్ అంతా కూడా. గిల్ అయితే బంతి వేసే సమయంలో దాదాపు మూడు నుంచి నాలుగు అడుగులు ముందుకు వచ్చేసాడు. కోహ్లీ, రహానే కూడా దాదాపు అదే విధంగా బ్యాటింగ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: