సామాన్యుడికి షాక్ ల మీద షాక్ లు త‌గ‌ల‌టం కామ‌న్ అయ్యింది. ఓవైపు క‌రోనా కార‌ణంగా ఆదాయం లేక స‌త‌మ‌తం అవుతుంటే మ‌రో వైపు పెరిగిన ధ‌ర‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఇప్ప‌టికే గ్యాస్, వంట‌నూనెల ధ‌ర‌లు కొండెక్కి కూచ్చున్నాయి. ఇక పెట్రోల్, డీజీల్ ధ‌రలు పాపం పెరిగిన‌ట్టు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్ పై రూ.30 పైస‌లు, డీజిల్ పై రూ.31 పైస‌లు పెరిగింది.

పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారంగా చూస్తే హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.101.19 గా ఉంది. అంతే కాకుండా డీజిల్ ధ‌ర రూ.96.04 గా ఉంది. ఇదిలా ఉండ‌గా మే 7 నుండి రాజస్థాన్, ఆంధ్ర‌ప్రదేశ్. తెలంగాణ‌., లడక్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల‌లో పెట్రోల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేశాయి. ఇలా పెట్రోల్ ధ‌ర‌లు రోజు రోజుకూ పెరుగుతుంటే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మరింత పెరిగే ప్ర‌మాధం ఉంద‌ని సామాన్యులు ఆందోళ‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: