క‌రోనా కాలంలో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా హైద‌ర‌బాద్ లోని మెట్రో రైళ్ల‌ను నిలిపివేశిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ లో చేసిన స‌డ‌లింపుల‌తో రైళ్ల వేళ‌ల్లో కూడా ప‌లు మార్పులు చేస్తూ వ‌చ్చాయి. అయితే నిన్న జ‌రిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో మెట్రో రైళ్ల షెడ్యూల్ లో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

లాక్ డౌన్ లేక‌పోవ‌డంలో నేటి నుండి పూర్తి స్థాయిలో మెట్రోలు న‌డ‌వ‌నున్నాయి. ఈ మేర‌కు కొత్త షెడ్యూల్ ను హైద‌రాబాద్ మెట్రో సంస్థ‌ విడుద‌ల చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.  అయితే క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ మాస్క్ లు ధ‌రించి భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. అంతే కాకుండా ప్ర‌యాణికులు సుర‌క్షితంగా గ‌మ్యాన్ని చేరుకునెలా సిబ్భంధి స‌హ‌క‌రించాల‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: