మలేషియా మహిళపై అత్యాచారం, గర్భస్రావం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎఐఎడిఎంకె మంత్రి ఎం మణికందన్‌ను బెంగళూరులో చెన్నై నగర పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ ఎఎన్‌ఐ పేర్కొంది. ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు చేసిన ఒక ప్రకటన మేరకు ఆ వార్త వెలుగులోకి వచ్చింది.


 ఈ కేసులో మద్రాస్ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో మాజీ రాష్ట్ర మంత్రి అరెస్టు కాక తప్పలేదు. ఆయన మీద ఉన్న అభియోగాలు తీవ్రంగా ఉన్నాయని మరియు అతను గతంలో ఉన్న శక్తివంతమైన పదవిని బట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. తమిళనాడులోని ఎఐఎడిఎంకె మాజీ మంత్రి ఎం మణికందన్, ఒక మలేషియా పౌరురాలయిన నటిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నారు, ఈ క్రమంలో గర్భం రావడంతో ఆమెకు బలవంతంగా గర్భస్రావం చేయమని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: