తెలంగాణలో కరోనా కేసులు తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు కూడా నియంత్రణలోకి వచ్చిన కారణంగా నేటి నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా విధించిన అన్ని ఆంక్షలు ఎత్తి వేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భక్తులు తమ దగ్గరలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు క్యూకడుతున్నారు. 


దాదాపు మే 12న విధించిన లాక్ డౌన్ పూర్తిస్థాయిలో నేటి నుంచి ఎత్తి వేయడంతో సుమారు 37 రోజుల తర్వాత భక్తులు దైవ దర్శనాలకు క్యూ కట్టారు. దానికి తోడు ఈ రోజు ఆదివారం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు కళకళలాడుతున్నాయి. అయితే మాస్క్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: