నేడు వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీల మొదలు సామాన్యుల దాకా అందరూ తమ తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. "నా హీరో, మార్గనిర్దేశ కాంతి, బలం, ప్రేరణ అంటూ తన తండ్రిని సంబోధించిన మహేష్ మీరు ఇవన్నీ అని చెప్పుకొచ్చారు. 


అలాగే నాకు మీరు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.  ఈ రోజు మాత్రమే కాదని సంవత్సరంలో ప్రతి రోజు మిమ్మల్ని జరుపుకుంటున్నా అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్నా అని విషెస్ తెలియజేసిన మహేష్ బాబు తన తండ్రితో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అది ఈ ఫోటో ఇప్పటిది కాదు.. అయితే మహేష్ బాబు కృష్ణ కలిసి ఆనందంగా నవ్వులు చిందిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: